TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part IV
దిల్లీలో తెలంగాణ బోనాల శకటం
* 2015, జనవరి 26న జరిగిన 66వ గణతంత్ర వేడుకల్లో వివిధ రాష్ట్రాలు తమ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకునే రీతిలో శకటాలను రూపొందించి ప్రదర్శించాయి.
* తెలంగాణ ప్రభుత్వం ‘బోనాల పండగ’కు ప్రతీకగా శకటాన్ని ప్రదర్శించింది.
సాలెపురుగుకు తెలంగాణ పేరు
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లా నాగ్నూర్ గ్రామంలో కొత్తగా గుర్తించిన సాలెపురుగుకు ‘తెలంగాణ క్రాబ్ స్పైడర్’ గా పేరు పెట్టినట్లు సాలెపురుగును కనుక్కున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం పేర్కొంది.
* రాష్ట్రం ఏర్పడ్డాక గుర్తించిన తొలి జీవరాశి కావడంతో ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల కార్మిక మంత్రుల సదస్సు
* దక్షిణాది రాష్ట్రాల కార్మిక మంత్రులు, కార్యదర్శుల మూడో ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో 2015, జూన్ 27న జరిగింది.
* ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్రకార్మిక శాఖామంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
‘ఉనికి’ పుస్తకావిష్కరణ
* తెలంగాణకు చెందిన మహారాష్ట్ర గవర్నరు సీహెచ్ విద్యాసాగర్‌రావు రాసిన ‘ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015, జులై 3న ఆవిష్కరించారు.
* విద్యాసాగరరావు గతంలో వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను ‘ఉనికి పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు.
సోలార్ నగరంగా మహబూబ్‌నగర్
* కేంద్ర నూతన, పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఎంపిక చేసిన మొత్తం 55 సోలార్ నగరాల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చోటు లభించింది.
* 2015 ఆగస్టులో సోలార్ నగరాల జాబితాను ప్రకటించారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో నగరానికి జనాభా ఆధారంగా 50 లక్షల రూపాయల వరకు ఆర్థికసాయం లభిస్తుంది.
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండోసారి స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటలో 2015, ఆగస్టు 15న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
* గోల్కొండ కోటలో జరిగిన 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరయ్యారు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రసంగించారు.
అవినీతిలో ‘రెవెన్యూ’
* ప్రభుత్వ శాఖల్లో అవినీతి, ఇతర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరుకు 6 నెలల కాలంలో వచ్చిన ఫిర్యాదులు పరిశీలించగా రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. పోలీసు శాఖ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నిత్యం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు జరిపే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శాఖలు ఉన్నాయి.
* వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా, ఆదిలాబాద్ జిల్లా నుంచి అతి తక్కువగా ఫిర్యాదులొచ్చాయి.
కృష్ణారెడ్డి మృతి
* తెలంగాణ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మేల్యే (కాంగ్రెస్) పట్టోళ్ల కృష్ణారెడ్డి(73) 2015, ఆగస్టు 25న గుండెపోటుతో మరణించారు.
* కృష్ణారెడ్డి 1989, 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
* గతంలో రెండుసార్లు పీఏసీ ఛైర్మన్‌గా పనిచేశారు. తిరిగి గత 6 నెలలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.
స్మార్ట్ నగరాలు
* దేశంలో 100 నగరాలను ఆకర్షణీయ నగరాలు(స్మార్ట్ సిటీలు)గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 98 నగరాల జాబితాను కేంద్రం 2015, ఆగస్టు 27న ప్రకటించింది. (ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, జమ్మూకశ్మీర్‌లో ఒకటి పెండింగ్‌లో ఉన్నాయి)
* తాజాగా ప్రకటించిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపికయ్యాయి.
* అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, తమిళనాడులో 12, మహారాష్ట్రలో 10 నగరాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3 నగరాలు ఎంపికయ్యాయి.
* తెలంగాణ నుంచి ఎంపికైన రెండు గ్రేటర్ నగరాలు… రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మొదటి, రెండు నగరాలు కూడా ఇవే.
* ఈ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రాలు, పురపాలక సంస్థలు అంతే మొత్తాన్ని సమకూర్చవలసి ఉంటుంది.
హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్
* గూగుల్ సంస్థ ఆసియాలోనే తన తొలి క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో గూగుల్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
* ఇది అమెరికా వెలుపల ఉన్న గూగుల్ క్యాంపస్‌లలో అతిపెద్దది కానుంది.
* 2016లో దీని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. రూ.1000 కోట్లుతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
‘అందరికీ ఇళ్లు’ పథకం
* పట్టణ ప్రాంత పేదల కోసం దేశ వ్యాప్తంగా 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ (హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
* ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం దేశంలో 9 రాష్ట్రాల నుంచి 305 నగరాలు, పట్టణాలను ఎంపిక చేసింది.
* వీటిలో తెలంగాణ నుంచి 34 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. పథకం అమలు బాధ్యతను నోడల్ ఏజెన్సీ అయిన పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ తీసుకుంది.
* ఈ కార్యక్రమం కింద కేంద్రం 2015-2022 మధ్య రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది.
* పథకం ముఖ్య ఉద్దేశం ‘మురికివాడల నిర్మూలన’.
కేసీఆర్ చైనా పర్యటన
* రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెబరు 7 – 16 తేదీల మధ్య చైనాలో పర్యటించారు.
పర్యటన ముఖ్యాంశాలు:
* నూతన రాష్ట్ర ఉనికి, పురోగతిని విశ్వవ్యాప్తం చేయడం.
* పారిశ్రామిక విధాన విశిష్టతలను తెలియజెప్పడం.
* రూ.50 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్
* హైదరాబాద్ – న్యూదిల్లీల మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ (నెం.12723/12724) రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
* 2015, నవంబరు 15 నుంచి కొత్తపేరు అమల్లో వస్తుంది.
* హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరును ఇదివరకే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.
పాలకుర్తి మార్కెట్‌కి ఐలమ్మ పేరు
* వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును వరంగల్ జిల్లా పాలకుర్తి ఉప మార్కెట్‌యార్డుకు పెడుతూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* ఇదివరకు తెలంగాణ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని 2015, జూన్ 2 నుంచి వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ధారావాహిక (సీరియల్)గా ప్రారంభించారు.
మోదీతో సంభాషణకు ఇద్దరి ఎంపిక
* ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు రోజు దేశవ్యాప్తంగా విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖికి (ఆన్లైన్ ద్వారా) తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు.
* ఎవరెస్ట్ పర్వతారోహణ చేసిన పూర్ణ, ఏషియన్ యోగా ఛాంఫియన్ షిప్లో కాంస్య పతకం నెగ్గిన సుందర్ రాజ్‌లు ఎంపికయ్యారు.
* వీరిద్దరూ సెప్టెంబరు 4న ప్రధానితో సంభాషణలో నేరుగా మాట్లాడారు.
Leave a Reply