TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Bits
మాదిరి ప్రశ్నలు
1. దేశంలో కొత్తగా అభయారణ్యాల కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్ని ‘పర్యావరణ పరిరక్షణ జోన్’గా ఎంపిక చేసింది?
జ: ప్రాణహిత
2. తెలంగాణ రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ – 2015’ ప్రకారం విస్తీర్ణం, జనాభా పరంగా భారతదేశంలో రాష్ట్ర స్థానం ఎంత?
జ: 12
3. దేశంలో నూతన రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించింది. అయితే తెలంగాణ ఎన్నో రాష్ట్రంగా ఏర్పాటైంది?
జ: 29
4. 2014 నవంబరులో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఆమోదించింది. కిందివాటిలో రాష్ట్ర పుష్పంగా దేన్ని ఎంపికచేశారు?
జ: తంగేడు
5. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్.. ఆసియాలోనే తన తొలి క్యాంపస్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది?
జ: హైదరాబాద్
6. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ నగరాన్ని ‘గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది?
జ: వరంగల్
7. 2015 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ: డాక్టర్ సి.రంగరాజన్
8. 2015-16 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్ కేటాయింపు ఎంత?
జ: రూ.1,15,689 కోట్లు
9. 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి ఎంతకు పెంచింది?
జ: 42శాతం
10. ‘టీఎస్-ఐపాస్’ దేనికి సంబంధించింది?
జ: తెలంగాణ పారిశ్రామిక విధానం
11. 2015 జూన్ 11న శంకుస్థాపన చేసిన పాలమూరు ఎత్తిపోతల భారీ నీటిపారుదల ప్రాజెక్టు వల్ల ఎక్కువగా లబ్ది పొందే జిల్లా ఏది?
జ: మహబూబ్‌నగర్
12. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ – ఐపాస్) ప్రకారం ఎంత పెట్టుబడి ఉన్న ప్రాజెక్టులను మెగా ప్రాజెక్టులుగా పేర్కొంది?
జ: రూ.200 కోట్లు కంటే ఎక్కువ పెట్టుబడులు, 1000 మంది కంటే ఎక్కువ ఉపాధి
13. దక్షిణాది రాష్ట్రాల కార్మిక మంత్రులు, కార్యదర్శుల మూడో ప్రాంతీయ సదస్సు 2015, జూన్ 27న ఎక్కడ జరిగింది?
జ: హైదరాబాద్
14. రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ 2015, జులై 3న ఎక్కడ ప్రారంభించారు?
జ: చిలుకూరు
15. తెలంగాణకు చెందిన సీహెచ్.విద్యాసాగరరావు రాసిన ‘ఉనికి’ పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015, జులై 3న ఆవిష్కరించారు. విద్యాసాగరరావు ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు?
జ: మహారాష్ట్ర
16. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన మహాపుష్కరాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించింది?
జ: జులై 14-25
17. 2015 జులైలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ దేశంతో ‘నృత్య కళా ఒప్పందం’ కుదుర్చుకుంది?
జ: ఇజ్రాయెల్
18. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రకటించిన ‘దాశరథి కృష్ణమాచార్యులు అవార్డు’ను ఆయన జయంతి సందర్భంగా 2015, జులై 22న ఎవరికి ప్రదానం చేశారు?
జ: తిరుమల శ్రీనివాసాచార్యులు
19. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని, వారికి మరిన్ని రాయితీ సిలిండర్లను అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో తెలంగాణ దేశవ్యాప్తంగా ఎన్నో స్థానంలో నిలిచింది?
జ: 13
20. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట ఏర్పాటు చేసిన ‘ఆచార్య దేవోభవ’ పురస్కారాన్ని ఆయన జయంతి సందర్భంగా 2015, ఆగస్టు 17న ఎవరికి ప్రదానం చేశారు?
జ: ప్రొఫెసర్ కోదండరాం
21. గ్రామాల సమ్మిళిత, సమీకృత అభివృద్ధి సాధన లక్ష్యంగా ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, ఆగస్టు 17న ఎక్కడ ప్రారంభించారు?
జ: వరంగల్ జిల్లా గంగదేవిపల్లి
22. రాష్ట్రంలో నిరుపేదల జీవనోపాధిని పెంపొందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ పల్లె ప్రగతి’ (తెలంగాణ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ – టీఆర్ఐజీపీ) కార్యక్రమాన్ని 2015, ఆగస్టు 22న మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ ఏది?
జ: ప్రపంచ బ్యాంక్
23. 2015 ఆగస్టులో కేంద్ర నూతన, పునర్వినియోగ ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఈ) దేశవ్యాప్తంగా 55 సోలార్ నగరాలను ఎంపిక చేసి ప్రకటించింది. వీటిలో తెలంగాణలోని ఏ నగరానికి చోటు లభించింది?
జ: మహబూబ్‌నగర్
24. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, ఇతర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది. 2015 జనవరి నుంచి జులై మధ్య ఈ నెంబరుకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించినప్పుడు అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న శాఖ ఏది?
జ: రెవెన్యూ
25. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీస్) కార్యక్రమంలో భాగంగా 2015 ఆగస్టు 27న 98 నగరాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఎంపికైన నగరాలు ఏవి?
జ: హైదరాబాద్, వరంగల్
Leave a Reply